¡Sorpréndeme!

Shreyas Iyer Reading Abhishek Sharma Paper | ఆ పేపర్ లో ఏముంది అభిషేక్ | ABP Desam

2025-04-13 2 Dailymotion

 పంజాబ్ విసిరిన 246 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో సన్ రైజర్స్ రఫ్పాడించింది. ప్రత్యేకించి సన్ రైజర్స్ ఓపెనర్లు ట్రావియెస్ హెడ్, అభిషేక్ శర్మ దుమ్ము లేపారు. కనీసం వికెట్ కూడా ఇవ్వకుండా మొదటివికెట్ కే 171 పరుగుల పార్టనర్ షిప్ పెట్టి సన్ రైజర్స్ విజయానికి కావాల్సిన బాట వేసేశారు. ప్రత్యేకించి అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 55 బంతుల్లో 14 ఫోర్లు 10 సిక్సర్లతో 141 పరుగులు చేసి అభిషేక్ శర్మ సన్ రైజర్స్ గెలుపును ఖరారు చేసేశాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి L సింబల్ అంటూ ఫ్యాన్స్ మీద తన లవ్ ను చూపించిన అభిషేక్...40 బంతుల్లో సెంచరీ కొట్టి తుక్కు రేగ్గొట్టాడు. సెంచరీ పూర్తి కాగానే అగ్రెసివ్ గా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్న అభిషేక్...ఆ తర్వాత తన జేబులో నుంచి ఓ చీటీ తీసి గ్రౌండ్ లో ఉన్న ఫ్యాన్స్ అందరికీ చూపించాడు. దాని మీద దిజ్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని రాసింది. అయితే అలా ఓ క్రికెటర్ పేపర్ మీద ఓ కోట్ రాసి తీసుకువచ్చి సెంచరీ చేసి ఫ్యాన్స్ కు చూపించటం అనేది కొత్త విషయం. అందుకే ఆపోజిట్ టీమ్ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆత్రం ఆపుకోలేకపోయాడు. అసలు ఆ పేపర్ లో ఏం రాశాడో చదవాలని అభిషేక్ శర్మ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి పేపర్ తీసుకుని చదివాడు.  తర్వాత అయ్యర్ దగ్గర నుంచి చాహల్ తీసుకుని చూసి తిరిగి అభిషేక్ కి ఇచ్చాడు. అభిషేక్ భారీ సెంచరీ తర్వాత ఆ పేపర్ ను చూపించటం అలా అపోజిట్ టీమ్ లోనూ క్యూరియాసిటీ పెంచింది అన్నమాట. అయితే ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ పేపర్ ను అభిషేక్ శర్మ గత ఐదు మ్యాచుల నుంచి జేబులో పెట్టుకుని వస్తున్నాడట. కానీ ఫెయిల్ అవ్వటంతో కుదర్లేదట. కానీ పంజాబ్ మీద మ్యాచ్ లో ఆ అవకాశం రావటంతో కుమ్మేయటంతో పాటు సెంచరీ బాదేసి మొత్తానికి ఆ పేపర్ తీసి చూపించాడని సీక్రెట్ చెప్పేశాడు హెడ్.